MS Dhoni: ఎంఎస్ ధోనీకి బిగ్ రిలీఫ్.. ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదన్న జడ్జి

MS Dhoni: ఎంఎస్ ధోనీకి బిగ్ రిలీఫ్.. ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదన్న జడ్జి

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026 19వ సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన పిటిషన్ ను బీసీసీఐ ఎథిక్స్ అధికారి అరుణ్ మిశ్రా తోసి పుచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ గా ఉంటూనే.. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న క్రికెట్ అకాడమీతో తన సంబంధం కొనసాగిస్తున్నారని 2024లో ఎంఎస్ ధోనిపై కంప్లైంట్ దాఖలైంది.

మహేంద్ర సింగ్ ధోని ఈ క్రికెట్ అకాడమీతో 2017లో ఒప్పందం చేసుకున్నాడు..  కానీ బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాల రూల్ ని 2018 సెప్టెంబర్  మాసం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ధోని ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. అలాగే ఎంఎస్ ధోని క్రికెట్ పరిపాలనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పదవిలో కూడా లేడని అన్నారు. ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడని స్పష్టం చేశారు.

క్రికెట్ అకాడమీలను కలిగి ఉండటం, వాటితో ఒప్పందాలు చేసుకోవడం బీసీసీఐ రూల్స్ ప్రకారం పెద్ద నేరం ఏమీ కాదని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. ఫిర్యాదుదారుడు– ఎంఎస్ ధోనితో తనకున్న వ్యక్తిగత, వాణిజ్య వివాదం కారణంగానే ఈ కంప్లైంట్ చేసినట్లుగా కనిపిస్తోంది చెప్పుకొచ్చారు. అలాగే ఈ కేసులో  ధోని ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆధారాలు ఏమాత్రం కనిపించడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తేల్చి చెప్పారు. దీంతో ఆ ఫిర్యాదును కొట్టి వేస్తున్నామని వెల్లడించారు.