బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ వారం దాదాపు చివరికి వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఫినాలేతో ముగియనుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య రసవత్తరంగా పోరు సాగుతోంది. టాప్ 5లో స్థానం కోసం తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనుజా, ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి,మాత్రమే మిగిలి ఉన్నారు. గ్రాండ్ ఫినాలే వీక్ కావడం, రెండు వారాల్లో బిగ్ బాస్ జర్నీ ముగియనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది.
సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోరు..
గతవారం ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. మిగిలిన కంటెస్టెంట్స్ సెకండ్ ఫైనలిస్ట్ స్థానం కోసం చెమటోడ్చుతున్నారు. మరో వైపు ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
సుమన్ శెట్టి కన్నీటి వీడ్కోలు
బిగ్ బాస్ హౌస్ లో 95వ రోజు ఒక ఎమోషనల్ సునామీని సృష్టించింది. లీడర్‌బోర్డ్‌లో తక్కువ పాయింట్స్ ఉన్న కంటెస్టెంట్స్‌ను ఫైనల్ రేస్ నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ ప్రకటన ప్రకారం, లీడర్ బోర్డ్‌లో అందరికంటే తక్కువ స్కోర్ సాధించిన కారణంగా సుమన్ శెట్టి ఈ పోరు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ప్రకటనతో సుమన్ షాక్‌కు గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, హౌస్ మేట్స్‌కు ఊరటనిచ్చేలా బిగ్ బాస్ ఒక ఆసక్తికరమైన మెలిక పెట్టాడు. సుమన్ దగ్గర ఉన్న లక్ష పాయింట్స్, అమౌంట్‌లో సగాన్ని వేరే పోటీదారుడికి ఇచ్చే అవకాశం కల్పించాడు.
ఎమోషనల్ త్యాగం..
సుమన్ వెంటనే తనకు అత్యంత ఆత్మీయుడైన భరణి దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరూ లేరు అన్న.. అంటూ కన్నీళ్లతో తన పాయింట్స్ భరణికి ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ అప్పటికే అత్యధిక స్కోర్‌తో ఉన్న భరణి.. ఆ పాయింట్స్ నా కంటే ఇంకెవరికి ఉపయోగపడతాయో ఆలోచించుఅని సుమన్‌కు సలహా ఇచ్చాడు. వెంటనే సుమన్, సంజన పేరు చెప్పగా, భరణి కూడా దాన్ని సమర్థించాడు. తర్వాత సుమన్, సంజనను బయటకు పిలిచి, నా పాయింట్స్ మీకు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పగానే, సంజన బోరుమంది. "నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి సుమన్ శెట్టి తన విలువైన పాయింట్స్, మొత్తంలో సగాన్ని సంజనకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ ఎమోషనల్ త్యాగానికి హౌస్‌మేట్స్ అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు. దీంతో సుమన్ శెట్టి టాప్ 5 రేసు నుంచి ఔట్ అయ్యారు.
నెక్ట్స్ టాస్క్.. 'ఇది జోక్ కాదు'!
సుమన్ ఎమోషనల్ వీడ్కోలు తర్వాత, బిగ్ బాస్ తదుపరి ఫైనలిస్ట్ రేసు కోసం 'ఇది జోక్ కాదు' అనే ఆసక్తికరమైన టాస్క్‌ను ఇచ్చాడు. ఈ టాస్క్‌కు భరణి సంచలక్‌గా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ ఒకరి తర్వాత ఒకరు స్లైడ్‌పై బాల్ పెట్టి, ఆ చివరికి వచ్చిన తర్వాత జోకర్‌కు తగిలేలా బాల్‌ను వేయాలి. ప్రతీ ఒక్కరికీ ఆరు అవకాశాలు ఉంటాయి. లేటెస్ట్ ప్రోమోలో సంజన, తనూజ ఈ గేమ్ బాగా ఆడినట్లు చూపించినప్పటికీ, ఎవరు విజయం సాధించారు, చివరికి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు అనేది తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే...

