ఎల్ఓసీ వ‌ద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఎల్ఓసీ వ‌ద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వ‌ద్ద ఇండియ‌న్ ఆర్మీ నిర్వ‌హించిన త‌నిఖీల్లో రెండు ఉగ్రవాద రహస్య స్థావరాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సోమ‌వారం నుంచి మంగ‌ళ‌వారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలవరకు నిర్వ‌హించిన‌ సోదాల్లో అనుమానిత ఉగ్రవాదులు దాచిన పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి బయటపడింది. వీటిలో ఏకే సిరీస్ రైఫిళ్లు, పిస్టళ్లు, తొమ్మిది మేగజైన్లు, 21 గ్రెనేడ్లు, యాంటెన్నాతో కూడిన రేడియో సెట్లు ఉన్నాయి. ఉగ్రవాదులతో బాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా వీటిని దాచి ఉంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారని, వీటితో తమపై దాడులకు దిగాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం ఏడెనిమిది గంటలపైగా విస్తృతంగా జరిపిన తనిఖీలు, సోదాల్లో ఇవి బయట పడినట్టు సైనిక ద‌ళాలు తెలిపాయి.

2 militant hideouts busted along LoC in Jammu and Kashmir's Baramulla, arms recovered