10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు

10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి బీజేపీ రాస్తానంటే బడుగు,బలహీన వర్గాలు ఆలోచించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రిజర్వేషన్లు ఉండవని చెప్పకనే చెప్పే ఇలాంటి పార్టీలకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. నిరుపేద మహిళలల బ్యాంకు ఖాతాలో 15 లక్షలు రూపాయలు సంవత్సరానికి వేస్తామని వేయలేదని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార సభలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  కాక వెంకటస్వామి సికింద్రాబాద్ నుండి మంచిర్యాల చెన్నూరు సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని ఏర్పాటు చేయడానికి కృషి చేశారని గుర్తు చేశారు.

 రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఎక్కువ కరెంటు అందిస్తున్నామని వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం తో విద్యుత్ వాడకం పెరిగిందని చెప్పారు. ప్రతిపక్షాలు కరెంటు ఇవ్వ్వడం లేదని అబ్బద్దపు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గడ్డం వంశీ క్రిష్ణ వైట్ చదువుకున్న వ్యక్తి అని అన్నారు. 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.