Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత

Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత

ప్రముఖ మలయాళ దర్శకుడు, కథా రచయిత హరికుమార్ (70)  కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ సోమవారం(మే6న) సాయంత్రం తుది శ్వాస విడిచారు. అతను తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే హరికుమార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 

హరికుమార్ 1981లో అంబల్ పూవు సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అతను సుకృతం, ఉద్యానపాలకన్, మరియు జలకం వంటి ప్రముఖ రచనలతో సహా మొత్తం 18 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. M T వాసుదేవన్ నాయర్, లోహితదాస్, శ్రీనివాసన్ మరియు కాలూర్ డెనిస్ వంటి ప్రముఖ కథా రచయితలతో కలిసి పనిచేశారు.

1994లో M T వాసుదేవన్ నాయర్ రచించిన సుకృతం, అతని దర్శకత్వ చేసిన చిత్రాలలో ది బెస్ట్ నిలిచి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సుకృతం ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక ఆయన చివరగా డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఆటో-రిక్షాకరంటే భార్య (2022). 

అయితే ఇటీవల కాలంలోనే పలు చిత్ర ప్రశ్రమాల్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో సినిమా అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.గడిచినా 10 రోజుల్లోనే 5 గురిపైగా సినీ ప్రముఖులు మరణించారు.