నారాయణగూడ, వెలుగు: వృద్ధ తల్లిదండ్రులను తరచూ వేధిస్తూ దాడులకు పాల్పడిన కొడుకుకు నాంపల్లి కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన వృద్ధ తల్లిదండ్రులను అకారణంగా తరచూ కొడుతూ, చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పొరుగువారు, శ్రీనివాస్ తన తల్లిదండ్రులపై దాడి చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి బాధిత వృద్ధులతో కలిసి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన నాంపల్లి కోర్టు నిందితుడికి రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.50 జరిమానా విధించింది. నిందితుడు దివ్యాంగుడు కావడం గమనార్హం.
