పాజిటివ్.. నెగెటివ్.. మళ్లీ పాజిటివ్

పాజిటివ్.. నెగెటివ్.. మళ్లీ పాజిటివ్

నోయిడాలో మళ్లీ హాస్పిటల్​లో చేరిన ఇద్దరు పేషెంట్లు
నోయిడా: కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన ఇద్దరు కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చింది. గత శుక్రవారం వీరికి టెస్టులు చేయగా వైరస్​ నెగెటివ్​ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేశారు. కానీ మళ్లీ మూడోసారి టెస్టుల్లో పాజిటివ్​ రావడంతో మళ్లీ రీ అడ్మిట్​ చేశారు. ఉత్తరప్రదేశ్​లోని గౌతమ్​బుద్ధనగర్​కు చెందిన ఇద్దరికి నోయిడాలోని గవర్నమెంట్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడికల్​ సైన్సెస్ లో ట్రీట్​ మెంట్​ ఇస్తున్నారు. 24 గంటల వ్యవధిలో వీరి నమూనాలు పరీక్షించగా నెగెటివ్​ వచ్చింది. దీంతో మూడోసారి టెస్టులు చేయగా వారికి పాజిటివ్​ వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్​ రిపోర్ట్​ను అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇలా నెగెటివ్​ వచ్చిన తర్వాత మళ్లీ పాజిటివ్​ రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా హాట్​ స్పాట్​గా ఉన్న గౌతమ్​బుద్ధనగర్​లో యూపీలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్​ 15 వరకూ హాట్​ స్పాట్లు ఉన్న ప్రాంతాలను పూర్తిగా సీల్​ చేసేశారు. ఈ నెలాఖరు వరకూ జనం ఎక్కడా గుమిగూడకుండా నిషేధం విధించారు.