ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాలో పనిజేయాలే.. లేకుంటే 20లక్షలు కట్టాలే

ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాలో పనిజేయాలే.. లేకుంటే 20లక్షలు కట్టాలే

‘పీజీ పూర్తయ్యాక ప్రభుత్వం కోరితే ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాల్లో పన్జేస్తాం. లేదంటే రూ.20లక్షలు చెల్లిస్తాం’.. అంటూ మెడికోల నుంచి కాలేజీలు బాండ్ పేపర్ రాయించుకుంటున్నాయి. అయితే, ఇలా బాండ్ తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని హెల్త్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. 2018లో సవరించిన తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం ప్రకారం సీనియర్ రెసిడెంట్ షిప్ తప్పని సరికాదని హెచ్ ఆర్డీఏ ప్రెసిడెంట్, డాక్టర్ మహేశ్ అంటున్నారు. ఈమేరకు బాండ్ అడగకుండా చర్యలు తీసుకోవాలంటూ కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీకి హెచ్చార్డీఏ ఇటీవల వినతిపత్రం అందజేసింది.

బాండ్ నిబంధనలకు విరుద్ధం కాదని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ చదివినవాళ్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో పీజీ చేసినవాళ్లు సర్కారు దవాఖానాల్లో అవసరం ఉన్నప్పుడు, ప్రభుత్వం కోరితే ఏడాదిపాటు సర్వీస్ చేయాల్సిందేనన్నారు. ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో చదివినవాళ్లు, ఆయా బోధనాస్పత్రుల్లో పన్జేయాల్సి ఉంటుందన్నారు.