
ప్రస్తుత రోజుల్లో నిత్యావసర సేవల్లో బ్యాంకింగ్ ముందు వరసలో ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకు వరకు వెళ్లనిదే కొన్ని పనులు జరగవు. ఇక బిజినెస్ చేసేవారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతిరోజూ డబ్బులు డిపాజిట్ చేయడం కోసమో.. విత్ డ్రా చేయడం కోసమో వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఈ క్రమంలో బ్యాంకు వర్కింగ్ డేస్, హాలిడేస్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఉండటం ఎంతో అవసరం. మరి.. మే నెలలో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులో ఇప్పుడు తెలుసుకుందాం.
మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రాంతీయ పండగలు, జాతీయ సెలవులు, రాష్ట్ర పండగల వంటివి ఆయా రాష్ట్రాన్ని బట్టి మారుతాయన్న సంగతి తెలిసిందే .
ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో లేబర్ డే, బుద్ధ పూర్ణిమ, మహారణా ప్రతాప్ జయంతి, వంటి ప్రాంతీయ పండగలు వంటి సెలవులు 6 రోజులు కాగా... నెలలో 4 ఆదివారాలు, రెండవ శనివారం, 4వ శనివారం కలుపుకొని మే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.