రీల్స్ కోసం హోటల్ వాలెట్స్ .. రూ. 1.4 కోట్ల బెంజ్ కారును ఎలా చేశారో చూడండి

 రీల్స్ కోసం హోటల్ వాలెట్స్ .. రూ. 1.4 కోట్ల బెంజ్ కారును ఎలా చేశారో చూడండి

రీల్స్ కోసం బెంగళూరు రెస్టారెంట్ వాలెట్లు ఓ కస్టమర్ కారును నాశనం చేశారు.  రూ. 1.4 కోట్ల మెర్సిడస్ బెంజ్ కారును బయటకు తీసుకెళ్లి   రీల్స్ చేసి పూర్తిగా డ్యామేజ్ చేశారు.      డ్యామేజ్ అయిన కారు  వీడియోను  యజమాని దివ్యఛబ్రా తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేయగాఈ వీడియో ఇపుడు  వైరల్ అవుతోంది. 

అసలేం జరిగిందంటే దివ్య ఛబ్రా కొత్తగా కొన్న తన మెర్సిడెస్ బెంజ్ కారులో  ఫిబ్రవరి 26న బెంగళూరులోని  మారతాహళ్లిలోని ది బెగ్ బార్బెక్యూ రెస్టారెంట్ లో భోజనం చేయడానికి వెళ్లింది. అక్కడ రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ చేయడానికి  తన కారు కీని ఓ వాలెట్ కు అప్పగించారు ఛబ్రా.  తర్వాత కాసేపటికి  కారు గోడకు గీసుకుపోయిందని చెప్పి  ఛబ్రాకు  కీ ఇచ్చి వెళ్లిపోయాడు వాలెట్. 

యజమాని ఛబ్రా పార్కింగ్ దగ్గరకు వెళ్ళి చూడగానే కారు పూర్తిగా డ్యామేజ్ అయింది.  గంట తర్వాత ఆమె కారు దగ్గరకు వెళ్లి చూడగా.. పార్కింగ్ చేస్తుండగా చిన్న ప్రమాదం జరిగిందని  రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది.  అయితే ఇది పార్కింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదం కాదని.. ఓ ముగ్గురు వాలెట్లు  తన కారును బయటకు తీసుకెళ్లి  రీల్స్ చేసిన  వీడియోలను బయట పెట్టింది కారు యజమాని ఛబ్రా.  కారును బయటకు తీసుకెళ్లి పార్క్ చేసేటప్పుడు  రెస్టారెంట్ బేస్ మెంట్ లోని ఓ గోడను డీ కొట్టింది. అపుడే  కారు పూర్తిగా డ్యామేజ్ అయిందని యజమాని తెలిపారు.  

అయితే ఈ కారు డ్యామేజ్ కావడంతో యజమాని ఛబ్రా ఇన్సురెన్స్ కంపెనీని సంప్రదించగా వాళ్లు వచ్చి చూసి చూసే సరికి రెస్టారెంట్ యాజమాన్యం పార్కింగ్ దగ్గర శిథిలాలను తొలగించారు.  విచారణలో తెలసిన విషయం ఏంటంటే  కారును  నడిపిన ముగ్గురు వాలెట్లలో ఒకరికి మాత్రమే లైసెన్స్ ఉంది.  కారును డ్యామేజ్ చేసిన వ్యక్తికి లైసెన్స్ లేదని గుర్తించారు.  అయితే తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అందులో ఒకరు ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా చూపెట్టారని కారు యజమాని ఛబ్రా ఆరోపించారు.  ఇన్సురెన్స్ కంపెనీ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అలాగే కారు తీసుకెళ్లి  చేసిన రీల్స్ ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్యామేజ్ జరిగిన నష్టం రూ.20 లక్షల వరకు ఉంటుందని ఛబ్రా తెలిపారు.  అయితే కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నందున క్లెయిమ్ రాలేదని చెప్పారు. ముగ్గురు వాలెట్లు ప్రస్తుతం అస్సాంలో  ఉన్నారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. 
 
 ఈ ఘటనపై  రెస్టారెంట్ పై కేసు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమపై నమోదైన కేసు కొట్టివేయాలని  రెస్టారెంట్ యజమాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతానికి   కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.