ఎర్ర సముద్రంలో జారిపడ్డ రూ.500 కోట్ల జెట్​

ఎర్ర సముద్రంలో జారిపడ్డ  రూ.500 కోట్ల జెట్​

వాషింగ్టన్: అమెరికాకు చెందిన యుద్ధ విమానం పొరపాటున ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జారి సముద్రంలో పడిపోయింది. యెమెన్‌‌‌‌‌‌‌‌లోని హౌతీ తిరుగుబాటుదారులను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ట్రంప్‌‌‌‌‌‌‌‌ సర్కారు చేపట్టిన రఫ్‌‌‌‌‌‌‌‌ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా, యూఎస్‌‌‌‌‌‌‌‌ నేవీకి చెందిన ఎఫ్‌‌‌‌‌‌‌‌, ఏ18ఈ ఫైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌ను ఎర్రసముద్రంపై మోహరించారు. ట్రూమన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గస్తీ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి హౌతీ తిరుగుబాటుదారులు మిసైల్‌‌‌‌‌‌‌‌ దాడి చేశారు.

 ఈ దాడిని తప్పించేందుకు షిప్‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హఠాత్తుగా మలుపు తిప్పడంతో దానిపై ఉన్న యుద్ధ విమానం జారి ఎర్రసముద్రంలో పడిపోయింది. ట్రక్కు సాయంతో విమానాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆ ట్రక్కు కూడా సముద్రంలో పడి మునిగిపోయింది. ఈ యుద్ధ విమానం విలువ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని యూఎస్‌‌‌‌‌‌‌‌ నేవీ అధికారులు తెలిపారు.