మేం హార్మూజ్ వద్దే ఉన్నం..అమెరికా దళాల కోసం వెయిటింగ్: ఇరాన్

మేం హార్మూజ్ వద్దే ఉన్నం..అమెరికా దళాల కోసం వెయిటింగ్: ఇరాన్
  • ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని

టెహ్రాన్: చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద యూఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేం దుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటిం చారు. దీనికి స్పందిస్తూ ఐఆర్టీసీ ఈ హెచ్చరికలు చేసింది. 

ఐఆర్డీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని మీడియాతో మాట్లాడుతూ.. అగ్రరాజ్యం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జటనకు జరిగిన ప్రమాదా న్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. దీంతో పాటు ఇటీవల ఆ దేశ చమురు ట్యాంకర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 

1987లో కువైట్ కు చెందిన బ్రిడ్జన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తుండగా.. నాటి ఉద్రిక్తతల దృష్ట్యా యూఎస్ నౌకాదళం ఆ నౌకకు రక్షణ కల్పించింది. అయితే నాడు ఆ నౌకను ఐఆర్ జీసీ లక్ష్యంగా చేసుకుంది. ఫార్సీ దీవుల సమీపంలో నౌక వెళ్లే మార్గంలో నీటి అడుగున పేలుడు పదార్థాలను ఉంచి దాడి చేసింది. ఈ ఘటనలో నౌక దెబ్బ తిన్నప్పటికీ.. తన ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాన్ని చేరుకుంది.