
ప్రాపర్టీ ట్యాక్స్.. ఈ ట్యాక్స్ చెల్లించాలంటే జనం ఎంత భారంగా ఫీల్ అవుతారో.. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలంటే బల్దియాకు కూడా అంతే భారంగా మారుతోంది. అయితే.. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు సూపర్ స్కీం ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. అదే ఎర్లీ బర్డ్ స్కీం.. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ స్కీం ఫలించింది.. ఈ స్కీంలో భాగంగా ఒక్క నెలలోనే రూ. 876 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయినట్లు తెలిపింది జీహెచ్ఎంసీ.
2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏప్రిల్ నెలలోనే చెల్లించినవారికి 5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. దీంతో గ్రేటర్ వాసులు పెద్ద ఎత్తున ఏప్రిల్ లోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు.
ఎర్లీ బర్డ్ స్కీంలో భాగంగా గత ఏడాది రూ. 831 కోట్ల ట్యాక్స్ వసూలు అయినట్లు తెలిపింది జీహెచ్ఎంసీ. గత ఏడాది కంటే ఈసారి రూ. 45కోట్లు వసూలు అయినట్లు తెలిపింది జీహెచ్ఎంసీ. ఇదిలా ఉండగా.. ఎర్లీ బర్డ్ స్కీం చివరి రోజు అయిన బుధవారం ( ఏప్రిల్ 30 ) ఒక్కరోజే రూ. 77 కోట్ల ట్యాక్స్ వసూలు అయినట్లు తెలిపింది జీహెచ్ఎంసీ.