గన్నవరంలో ఎయిర్ పోర్ట్లో ల్యాండింగ్కు ఛాన్స్ లేక శంషాబాద్కు తిరిగొచ్చిన విమానం

గన్నవరంలో ఎయిర్ పోర్ట్లో ల్యాండింగ్కు ఛాన్స్ లేక శంషాబాద్కు తిరిగొచ్చిన విమానం

హైదరాబాద్: శంషాబాద్-గన్నవరం ఎయిర్ ఇండియా విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయింది. గన్నవరంలో ఎయిర్ పోర్ట్లో వాతావరణం అనుకూలించక ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించలేదు. విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది. విమానంలోని 106 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

ఈ విమానం మాత్రమే కాదు గన్నవరం విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించక బిల్‌గేట్స్‌ స్పెషల్ ఫ్లైట్ కు కూడా ల్యాండింగ్‌ ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఉండటంతో విజయవాడ చుట్టూ బిల్‌గేట్స్‌ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. కొంతసేపటికి అనుమతి రావడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.