CSK vs PBKS: చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించిన సామ్ కరణ్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

CSK vs PBKS: చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించిన సామ్ కరణ్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. బుధవారం (ఏప్రిల్ 30) జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా సామ్ కరణ్ (47 బంతుల్లో 88:9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ (32)  భారీ భాగస్వామ్యంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. సామ్ కరణ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్ గానిలిచాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఓమార్జాయి, హరిప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసుకున్నారు.     

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుష్ మాత్రే (7) మంచి టచ్ లో కనిపించినా పవర్ ప్లే లోపే ఔటయ్యారు. క్రీజ్ లో ఉన్నంత వరకు మెరుపులు మెరిపించి జడేజా (17) ఆరో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ కు చేరాడు. దీంతో చెన్నై 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దేవాల్డ్ బ్రెవిస్, సామ్ కరణ్ సూపర్ కింగ్స్ కు నిలబెట్టారు. మొదట్లో పరుగులు చేయడానికి తడబడినా క్రమంగా బ్యాట్ ఝులిపించారు. నాలుగో వికెట్ కు 78 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. 

►ALSO READ | CSK vs PBKS: ఐపీఎల్ వదిలి వెళ్తున్న మ్యాక్స్ వెల్.. శ్రేయాస్ అయ్యర్ హింట్ ఇచ్చేశాడుగా!

ఈ క్రమంలో సామ్ కరణ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్రేవీస్ ను ఓమార్జాయి బౌల్డ్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సామ్ మాత్రం బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. దూబేతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ మొత్తం అద్భుతంగా ఆడిన కరణ్.. 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో పంజాబ్ బౌలర్లు విజృంభించడంతో చెన్నై 200 మార్క్ చేరుకోవడంలో విఫలమైంది. 19 ఓవర్లో చాహల్ హ్యాట్రిక్ తీసుకోవడం విశేషం.