CSK vs PBKS: ఐపీఎల్ వదిలి వెళ్తున్న మ్యాక్స్ వెల్.. శ్రేయాస్ అయ్యర్ హింట్ ఇచ్చేశాడుగా!

CSK vs PBKS: ఐపీఎల్ వదిలి వెళ్తున్న మ్యాక్స్ వెల్.. శ్రేయాస్ అయ్యర్ హింట్ ఇచ్చేశాడుగా!

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2025 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్టు తెలుస్తుంది. చేతి వేలి గాయం కారణంగా ఈ ఆసీస్ స్టార్.. బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు దూరమయ్యాడు. టాస్ సమయంలో  పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రెజెంటర్ డానీ మోరిసన్ కు మ్యాక్స్ వెల్ చేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడని వెల్లడించాడు. త్వరలోనే ఐపీఎల్ వదిలి తమ స్వదేశానికి వెళ్తున్నట్టు సమాచారం.     

మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు.   మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఓవరాల్ గా 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. 

ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ధోనీ సేనకు చావో రేవో. ఒకవేళ ఓడిపోతే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరువవుతుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై తొలి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.