
ఐపీఎల్ 2025 లో ఒక అద్భుతమైన మూమెంట్ చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ క్యాచ్ ను జడేజా అద్భుతంగా అందుకున్నాడు. బుధవారం (ఏప్రిల్ 30) పంజాబ్ కింగ్స్ పై చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదేంటి ధోనీ క్యాచ్ పట్టడమేంటి.. ఇద్దరూ ఒకే టీం కదా అనే అనుమానం రావొచ్చు. అయితే అసలు విషయం తెలిస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో 19 ఓవర్ చాహల్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ తొలి బంతికే ధోనీ లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టాడు. వన్ హ్యాండెడ్ తో కొట్టిన ఈ స్టన్నింగ్ షాట్.. సిక్సర్ వెళ్ళింది. బౌండరీ దగ్గర ఉన్న జడేజా ధోనీ క్యాచ్ అందుకొని సర్ ప్రైజ్ చేశాడు. ధోనీ కొట్టిన ఈ షాట్ ను క్యాచ్ అందుకున్న జడేజా తనదైన శైలిలో సెలెబ్రేషన్ చేసుకోవడం ముచ్చట గొలిపే విధంగా ఉంది. ధోనీ, జడేజా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ కొట్టిన సిక్సర్ ను క్యాచ్ అందుకోవడం జడేజాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
జడేజా పట్టిన ఈ క్యాచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాహల్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టిన ధోనీ రెండో బంతికి లాంగాఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓవరాల్ గా నాలుగు బంతుల్లో ఫోర్, సిక్సర్ తో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక జడేజా 4 ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సామ్ కరణ్ (47 బంతుల్లో 88:9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ (32) భారీ భాగస్వామ్యంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది.
MS Dhoni hitting one handed six and Jadeja taking his catch 🤣💛pic.twitter.com/RWnjxLG5rK
— 𝙼𝚛.𝚅𝚒𝚕𝚕𝚊 (@Shivayaaah) April 30, 2025