CSK vs PBKS: హ్యాట్రిక్‌తో చాహల్ విజృంభణ.. 11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయిన చెన్నై

CSK vs PBKS: హ్యాట్రిక్‌తో చాహల్ విజృంభణ.. 11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయిన చెన్నై

ఐపీఎల్ 2025 లో తొలి హ్యాట్రిక్ నమోదయింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19 ఓవర్లో చివరి మూడు బంతులకు చాహల్ వికెట్లను తీసుకుని తన హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు ఈ ఓవర్లో రెండో బంతికి మరో వికెట్ పడగొట్టి మొత్తం ఈ ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చెన్నై స్కోర్ ను 200 పరుగుల మార్క్ చేరకుండా అడ్డుకున్నాడు. 

19 ఓవర్ నాలుగో బంతికి హుడాను ఔట్ చేసిన చాహల్.. ఆ ఆతర్వాత బంతికే బౌల్డ్ చేశాడు. చివరి బంతికి నూర్ అహ్మద్ ను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్న చాహల్ తనదైన శైలిలో కిందపడి సెలెబ్రేషన్ చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో చివరి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులతో పటిష్టంగా కనిపించిన చెన్నై తమ చివరి 6 వికెట్లను కేవలం 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది. 11 బంతుల్లో ఆ జట్టు 6 వికెట్లను కోల్పోవడం హైలెట్ గా మారింది.

ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా చాహల్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సామ్ కరణ్ (47 బంతుల్లో 88:9 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాల్డ్ (32)  భారీ భాగస్వామ్యంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఓమార్జాయి, హరిప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసుకున్నారు.