
- బదిలీ అనంతరం స్మితా సబర్వాల్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బదిలీ అనంతరం ట్వీట్ చేశారు. భగవద్గీతలోని శ్లోకాన్ని తన బదిలీకి అన్వయిస్తూ.."కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన(నీకు పని చేయడానికి మాత్రమే హక్కు ఉంది. కానీ దాని ఫలితాలపై అధికారం లేదు). 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 2025--2030ని రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
"Karmanye vadhikaraste, ma phaleshu kadachana"#IAS
— Smita Sabharwal (@SmitaSabharwal) April 29, 2025
Spent 4 months in Tourism.
Did my best!
1.Brought in the long pending Tourism Policy 25-30, a first for the State. Will create a solid frame for direction & investment in neglected tourist circuits.
2. Revamped the working… pic.twitter.com/2nUlVQO4W3
నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను. అది నాకు ఆనందం. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా తెలిపారు. ఇటీవల బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆమెను.. ఫైనాన్స్ కమిషన్ మెంబర్సెక్రటరీగా పంపింది.