చేవెళ్ల జోన్ పరిధిలో పోగొట్టుకున్న 218 ఫోన్లు రికవరీ

చేవెళ్ల జోన్ పరిధిలో పోగొట్టుకున్న 218 ఫోన్లు రికవరీ

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల జోన్ పరిధిలో పోగొట్టుకున్న 218 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో 157 ఫోన్లను బుధవారం మొయినాబాద్ పీఎస్​లో బాధితులకు డీసీసీ యోగేశ్​ గౌతమ్​ అందజేశారు.  ఈ సంవత్సరం 663 ఫోన్లు పోయినట్లు బాధితులు సీఈఐఆర్​ పోర్టల్​లో వివరాలు నమోదు చేశారని తెలిపారు.