ఖమ్మం జిల్లా: కాల్వలో దూకిన భర్త.. మనస్తాపంతో భార్య ఏం చేసిందో తెలుసా..!

ఖమ్మం జిల్లా: కాల్వలో దూకిన భర్త.. మనస్తాపంతో భార్య ఏం చేసిందో తెలుసా..!
  • భర్త ఆచూకీ కోసం గాలింపు
  • ఖమ్మం జిల్లా అమ్మపాలెంలో ఘటన

కొణిజర్ల, వెలుగు : కుటుంబ గొడవలతో భర్త కాల్వలో దూకగా.. విషయం తెలుసుకున్న భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తేజావత్ హరిప్రసాద్, సునీత (32) భార్యాభర్తలు. వీరికి మనోహర్, భార్గవి పిల్లలు. హరిప్రసాద్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెంకటాయపాలెం సమీపంలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్పీ కాల్వ వద్ద హరిప్రసాద్ ఆటో కనిపించడంతో అతడు కాల్వలో దూకాడని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో మనస్తాపానికి గురైన సునీత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఎన్ఎస్పీ కాల్వలో గాలించగా.. రాత్రి వరకు ఆచూకీ దొరకలేదు. మరోవైపు సునీత మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిప్రసాదే సునీతను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కొణిజర్ల ఎస్సై సూరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.