ఆగస్టు 15 నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్లు

ఆగస్టు 15 నుంచి  రెండున్నర లక్షల కొత్త పింఛన్లు

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15 నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. తొలి ప్రాధాన్యం ఒంటరి మహిళలు, వితంతువులకు ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆమెను కలిసిన మీడియా ప్రతినిధులతో  మాట్లాడారు. 

కొత్త పింఛన్ల అమలుపై శాఖాపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ జలసిరి, వీబీజీ రామ్‌జీ, చేయూత పింఛన్ల పథకాల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.