కొత్తగూడెం పోక్సో కోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం పోక్సో కోర్టు సంచలన తీర్పు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఓ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 27 ఏండ్లు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఫస్ట్​ అడిషనల్​డిస్ట్రిక్ట్​ సెషన్స్​జడ్జి (పోక్సో కోర్టు)ఎం. శ్యాం సోమవారం సంచలనాత్మక తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్రీనివాస్​(42) మాయమాటలతో 17 ఏండ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై పట్టణంలోని వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో 2019, మే 7వ తేదీన కేసు నమోదైంది. కోర్టులో13 మంది సాక్షులను విచారించిన తర్వాత నేరం రుజువు కావడంతో పోక్సో యాక్ట్​ కింద 25 ఏండ్ల  జైలు, రూ.పదివేల ఫైన్..​అలాగే ఐపీసీ 506 సెక్షన్​ కింద మరో రెండేండ్ల జైలుతో పాటు రూ.మూడు వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్​తరఫునస్పెషల్​పబ్లిక్​ ప్రాసిక్యూటర్ ​రామారావు వాదనలు వినిపించగా, లైజన్​ఆఫీసర్లుగా వీరబాబు, హరిగోపాల్​ వ్యవహరించారు. కోర్టు పీసీ కరీముద్దీన్​ సహకరించారు.