నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వ ర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్డీఏ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన చదల వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ 'ఏఎన్నార్ గారు, శోభన్ బాబు గార్ల దగ్గరినుంచి ఎంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను.
అప్పట్లో ప్రతి సినిమాని 30 నుంచి 40 రోజుల్లో తీశా. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శ కులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా.
మంచి విలువలు, చక్కని కథలతో కూడిన కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్నకుమార్ హాజరై చదలవాడ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.

