6 గంటల్లో.. 349 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

6 గంటల్లో.. 349 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
  •     సైబరాబాద్​ ట్రాఫిక్ పీఎస్  లిమిట్స్ లో నమోదు 
  •     మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిలో యువతే ఎక్కువ 
  •     253 బైక్​లు, 16 ఆటోలు,74 కార్లు, 6 హెవీ వెహికల్స్ స్వాధీనం 

గచ్చిబౌలి, వెలుగు : మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని చెబుతున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. పబ్​లు, బార్లు, వైన్సుల్లో మద్యం తాగి డ్రంకెన్ డ్రైవ్ లు చేస్తూనే ఉన్నారు. సైబరాబాద్​ట్రాఫిక్ పోలీసులు ఈనెల 15న సాయంత్రం 6.30 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చేపట్టిన డ్రంకెన్  డ్రైవ్​లో 349 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 3 యువతులు ఉన్నారు. ఎక్కువగా మాదాపూర్​ ట్రాఫిక్​ పీఎస్ లిమిట్స్​లోనే 74 మంది దొరికారు. తక్కువగా అల్వాల్​ట్రాఫిక్ పీఎస్ లిమిట్స్​లో ఏడుగురు చిక్కారు. 

253 బైకులు,16 ఆటోలు, 74 కార్లు, 6 హెవీ వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో 21 –30 ఏండ్లలోపు వారు 172 మంది, 31 –40 ఏండ్లలోపు వారు 104 మంది ఉన్నారు. సిటీలో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు డ్రంకెన్ డ్రైవ్ ప్రధాన కారణమని సైబరాబాద్​ట్రాఫిక్​జాయింట్​కమిషనర్​జోయెల్​డేవిస్​తెలిపారు. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.