35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్లే.. BCI చైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు

35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్లే.. BCI చైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు

మన దేశంలో 35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్స్ అని బార్ కౌన్సి్ల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 35- నుంచి 40 శాతం మంది న్యాయవాదులు నకిలీ డిగ్రీలతో వృత్తిలో కొనసాగుతున్నారని.. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని బార్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ విషయం తమకు తెలుసని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకునే పనిలోనే ఉన్నామని బీసీఐ ఛైర్‌పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. కోర్టు ప్రాంగణాల్లో నల్ల కోటు ధరించి కనిపించే వారిలో సుమారు 35 నుంచి 40 శాతం మంది నకిలీ అడ్వకేట్లనే సంగతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలుసని, వారి డిగ్రీలు పూర్తిగా నకిలీవని ఆయన ఆరోపించారు.

►ALSO READ | కాక్ రోచ్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్... మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజీత్ ట్వీట్..!

డిగ్రీలను ధృవీకరించే ప్రక్రియను బీసీఐ ప్రారంభించిన సమయంలో.. సుమారు 40 శాతం మంది న్యాయవాదులు ధృవీకరణ పత్రాలను నింపకపోవడమే ఇందుకు నిదర్శమని మిశ్రా తెలిపారు. ఈ 40 శాతం మంది న్యాయవాదులు నకిలీవారని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాను భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లానని వివరించారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల కారణంగా.. పుట్టుకొచ్చిన 'బొద్దింక జనతా పార్టీ' సోషల్ మీడియా ఉద్యమంపై తన అభిప్రాయాలనూ వెల్లడిస్తున్న క్రమంలో BCI చైర్ పర్సన్ ఈ ప్రకటన చేశారు. సీజేఐ వ్యాఖ్యలను వివరిస్తూ.. నకిలీ డిగ్రీలతో వృత్తులలో చేరే యువతను ఉద్దేశించి మాత్రమే సీజేఐ ఆ వ్యాఖ్యలు చేశారని మిశ్రా చెప్పుకొచ్చారు.