కాక్ రోచ్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్... మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజీత్ ట్వీట్..!

కాక్ రోచ్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్... మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజీత్ ట్వీట్..!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కాక్ రోచ్ పార్టీని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వెబ్ సైట్ ను కూడా సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాక్ రోచ్ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ ను డౌన్ చేసిందంటూ ట్వీట్ చేశారు అభిజీత్. మా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదని ట్వీట్ లో పేర్కొన్నారు అభిజీత్.

పది లక్షల మంది తమ పార్టీ మెంబెర్స్ గా వెబ్ సైట్ లో సైన్ చేసారని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ 6 లక్షల మంది పిటిషన్ పై సైన్ చేశారని ట్వీట్ లో పేర్కొన్నారు అభిజీత్. ప్రభుత్వం కాక్ రోచ్ లకు ఎందుకంత భయపడుతుందో అర్థం కావట్లేదని... ఈ నియంతృత్వ ధోరణి దేశ యువతకు కనువిప్పు కలిగించాలని అన్నారు అభిజీత్.

ALSO READ : నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ చేశారు

దేశ పౌరులుగా తమకు మంచి భవిష్యత్తు కావాలని కోరడమే కాక్ రోచ్ పార్టీ చేసిన తప్పా..? అంటూ ప్రశ్నించారు అభిజీత్. కాక్ రోచ్ లను అంతమొందించడం అంత ఈజీ కాదని.. కాక్ రోచ్ లు ఎప్పటికి చనిపోవంటూ ట్వీట్ లో పేర్కొన్నారు అభిజీత్.