దేశంలో 44% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

దేశంలో 44% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల్లో 44% మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.  ఇటీవల నిర్వహించిన ఓ సర్వే అధికారికంగా ఈ విషయాలను వెల్లడించింది.  ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి.  

దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4 వేల 33 ఎమ్మెల్యేలకు గానూ 4 వేల మంది మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌ తదితర తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది. కేరళలో 70 శాతం ఉన్న 135 మంది ఎమ్మెల్యేల్లో 95 మంది క్రిమినల్ కేసులున్నాయి.  

క్రిమినల్ రికార్డులతో పాటు ఎమ్మెల్యేల ఆస్తులను కూడా ఈ నివేదికలో విశ్లేషించారు. రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.13.63 కోట్లుగా గుర్తించారు. అయితే క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.11.45 కోట్లు కాగా, క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.16.36 కోట్లుగా ఉన్నాయి. 223 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.64.39 కోట్లతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా, 174 ఎమ్మెల్యేలకు రూ.28.24 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 

 కర్ణాటక ఎమ్మెల్యేలలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్నారు, 223 మందిలో 32 మంది (14 శాతం), అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. 4,001 మంది ఎమ్మెల్యేలలో 88 మంది (2 శాతం) బిలియనీర్లు, రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని తేలింది.