సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 46 మంది విద్యార్థులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను చెంచల్ గూడా జైలుకు తరలించారు. కాగా, అరెస్టయిన నిందితుల కుటుంబసభ్యులు ఆందోళన బాటపట్టారు. అరెస్టయిన విద్యార్థులను కలవడానికి తల్లిదండ్రులు చంచల్ గూడా జైలు వద్దకు భారీగా తరలివచ్చారు. తమ పిల్లలకు ఏమీ తెలియదని కన్నీరు పెట్టుకుంటున్నారు.ప్రస్తుతం వీరంతా చంచల్ గూడా జైళ్లో ఉన్నారు. వారితో ములాఖత్ కోసం నిందితుల కుటుంబసభ్యులు జైలు ముందు పడిగాపులు కాస్తున్నారు.
