బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి.. లేకుంటే పార్టీ ఆఫీసులకు  తాళాలు వేస్తం: ఆర్.కృష్ణయ్య 

బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి.. లేకుంటే పార్టీ ఆఫీసులకు  తాళాలు వేస్తం: ఆర్.కృష్ణయ్య 

కాచిగూడ, వెలుగు : రానున్న ఎన్నికల్లో  బీసీలకు అన్ని పార్టీలు 50 శాతం టికెట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ ఆఫీసులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. సగం సీట్లు కేటాయించిన పార్టీకే బీసీల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ కాచిగూడలో బీసీ కుల సంఘాల సదస్సులో  పాల్గొని, మాట్లాడారు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు జెండాలను మోసే కూలీలుగా  చూస్తున్నాయని కృష్ణయ్య అన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. బీసీలపై పార్టీలు వైఖరి మార్చుకోవాలని సూచించారు. పక్క రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. పాలనలో బీసీలకు పెద్దపీట వేసి జగన్.. దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించి.. 50 శాతం టికెట్లు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.