
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత,కేంద్రమాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 96వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 5కే రన్ ను ప్రారంభించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. అంబేద్కర్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం వరకు ఈ 5కె రన్ జరగనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వినోద్.. పేద విద్యార్థులకు విద్యానందించేందుకు కాకా వెంకటస్వామి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విద్యాసంస్థలు ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయన్నారు. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 180 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 5500 మంది విద్యార్థులకు గత 52 సంవత్సరాలుగా విద్యనందిస్తున్నాయని చెప్పారు. సమాజంలో విద్యతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన కాక అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ప్రారంభించారని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యార్థులు అంబేద్కర్ విద్యాసంస్థలు అటానమస్ ర్యాంకును పొందడం చాలా సంతోషకరమన్నారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు కాక అందించిన సేవలు ఆదర్శంగా నిలిచేలా అంబేద్కర్ విద్యాసంస్థల నిర్వహణ కొనసాగుతుందన్నారు.