V6 News

ఇండియా రెజ్లర్లకు 6 స్వర్ణాలు

ఇండియా రెజ్లర్లకు 6 స్వర్ణాలు

న్యూఢిల్లీ:  ఆసియా అండర్‌‌–15 చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా యువ రెజ్లర్లు అదరగొడుతున్నారు. శనివారం ఒక్కరోజే ఆరు గోల్డ్‌‌ మెడల్స్‌‌ కైవసం చేసుకున్నారు. దాంతో ఈ టోర్నీలో ఇండియా స్వర్ణాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

బాలికల్లో వరల్డ్‌‌ క్యాడెట్‌‌ చాంపియన్‌‌ కోమల్‌‌ (39కేజీ), సలోని (33కేజీ), బబ్లీ (36కేజీ).. ఫ్రీస్టయిల్‌‌ బాలుర విభాగంలో ఆకాశ్‌‌ (48కేజీ), గ్రీకో–రోమన్‌‌లో అంకిత్‌‌ గులియా (68కేజీ), చిరాగ్‌‌ దాలియా (75కేజీ) తమ ప్రత్యర్థులను ఓడించి చాంపియన్లుగా నిలిచారు.  అలాగే, ఉదిత్‌‌ కుమార్‌‌ (57కేజీ) సిల్వర్‌‌, కపిల్‌‌ (52 కేజీ) కాంస్యం కైవసం చేసుకున్నారు.

Read More