ఢిల్లీ : నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఢిల్లీలో సోమవారం ఈ గ్యాంగ్ నుంచి 6 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నకిలీ కరెన్సీ మొత్తం 2 వేల రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయి. ఈ కేసులో ఆలం అన్సారీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు, అతనిది నేపాల్ అని పోలీసులు తెలిపారు.
