50 అంబులెన్స్ వాహనాలు దగ్ధం

50 అంబులెన్స్ వాహనాలు దగ్ధం

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 అంబులెన్స్ వాహనాలు కాలి బూడిదైపోయాయి. స్థానిక దేవరయాంజల్ లో గల  జీవికే ఈఎంఆర్ఐ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది.  రిపేరు నిమిత్తం పాత 108 వాహనాలన్ని ఆ కార్యాలయ ప్రాంగణంలో పార్క్ చేశారు. ప్రమాదవశాత్తు ఒక వాహనంలో మొదలైన మంటలు మొత్తం వాహనాలకు అంటుకోవడంతో మొత్తం 50 వాహనాలు కాలిబూడిదైపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మొత్తం పార్కింగ్ చేసి ఉన్న  70  వాహనాల్లో 50 అంబులెన్స్ వాహనాలు అగ్ని కి ఆహుతయ్యాయి.  శిథిలావస్థకు చేరిన ఈ అంబులెన్స్ లను అధికారులు మరికొద్ది రోజుల్లో వేలంపాట వేయనుండగా సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చెట్ల పొదల్లో అంబులెన్స్ లను పార్కింగ్ చేయడంతో ఎండలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం పై అధికారులు మాత్రం పెదవి విప్పట్లేదు. న్యూస్ కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా జీవికే సిబ్బంది లోపలకు అనుమతించట్లేదు. దీంతో ఈ ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.