ఏఈఈ పరీక్షకు  62.89%  మంది హాజరు

ఏఈఈ పరీక్షకు  62.89%  మంది హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష ముగిసింది. మొత్తం 22,173 మంది అభ్యర్థులకుగాను.. పేపర్ 1కు 13,946 (62.89%) మంది, పేపర్ 2కు 13,947 (62.90%) మంది హాజరయ్యారు. 18 జిల్లాల్లోని 83 సెంటర్లలో ఎగ్జామ్ జరిగిందని టీఎస్​పీఎస్సీ అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఓ అభ్యర్థి ఫోన్​తో ఎగ్జామ్ సెంటర్లోకి రాగా.. అధికారు లు ఫోన్‌‌‌‌ను సీజ్ చేసి, అతనిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు.