64 మంది జెన్కో ఇంజనీర్లకు పదోన్నతులు : సీఎండీ హరీశ్

64 మంది జెన్కో ఇంజనీర్లకు పదోన్నతులు : సీఎండీ హరీశ్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా జెన్​కో సంస్థలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 64 మంది ఇంజనీర్లకు పదోన్నతులు ఇస్తూ ఆదివారం ఆ సంస్థ సీఎండీ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎస్ఈ నుంచి సీఈలుగా నలుగురు, డీఈఈ, ఈఈల నుంచి ఎస్ఈలుగా11 మంది, ఏడీఈ, ఏఈఈల నుంచి డీఈఈ, ఈఈలుగా 37 మంది, ఏఈ, ఏఏఈల నుంచి ఏఈఈలుగా12 మందికి  పదోన్నతులు ఇచ్చారు. 

వీరిలో ఎలక్ట్రికల్​ విభాగంలో 24 మంది, మెకానికల్ లో17 మంది, సివిల్​లో 23 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ పోస్టింగ్స్ ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన వారు తమకు కేటాయించిన పోస్టింగ్​లలో వెంటనే విధుల్లో చేరాల్సిందిగా సీఎండీ ఆదేశించారు. పరిపాలనా సౌలభ్యం కోసం, రాబోయే వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడానికి ఈ పదోన్నతులు ఇచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు.