గచ్చిబౌలి, వెలుగు: ఒక బైక్‌పై 71 పెండింగ్ ట్రాఫిన్ చలాన్లను మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెహికల్ చెకింగ్‌లో గుర్తిం చారు. మూడేండ్లుగా ఈ– చలాన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ టీవీ రావు తన సిబ్బందితో కలిసి గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అదే టైమ్‌లో మెహిదీపట్నం నుంచి లింగంపల్లి వైపు బైక్‌పై వెళ్తోన్న ఎండీ ఆరిఫ్ ను పోలీసులు ఆపారు. అతడి బైక్‌పై చలాన్లను చెక్ చేశారు. 71 పెండింగ్ చలాన్లు, రూ.19,935 ఫైన్ ఉన్నట్లు గుర్తించారు. చలాన్లను ఆరిఫ్ వెంటనే చెల్లించడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు ఎస్ఐ తెలిపారు.
