7/G బృందావన కాలనీకి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం

 7/G బృందావన కాలనీకి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం

2004లో విడుదలైన 7/G బృందావన కాలనీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీ, కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం, కథ, పాటలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో  రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ సినిమా విడుదలైన నాటికి ఈ పేర్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, వీళ్ల నటనతో అందరినీ మెప్పించి సినిమా థియేటర్లకు రప్పించారు. అయితే, ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం 7/G బృందావన కాలనీకి సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.

సినిమా పార్ట్ 2ను నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఏఎం రత్నం వెల్లడించారు. అయితే, ఈ సినిమాకి రవికృష్ణనే మళ్లీ కథానాయకుడిగా నటిస్తారని ఏఎం రత్నం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి సెల్వరాఘవన్‌తో కూడా చర్చలు జరుపినట్లు తెలిపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు షూటింగ్ లో ఉన్న సెల్వరాఘవన్‌ పనులు పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.