- డిప్యూటీ సీఈవోలకు పదోన్నతి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో ఎనిమిది మంది డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (డిప్యూటీ సీఈవో)కు జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (జడ్పీ సీఈవో) పదోన్నతి లభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ జీవో విడుదల చేశారు. 2025–26 ప్యానెల్ ఇయర్ కింద అడ్‌హాక్ ప్రాతిపదికన ఈ ప్రమోషన్లు కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు తదుపరి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.
