- అందజేసిన ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తరాఖండ్ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ప్రజాసేవ, పోలీసు శాఖకు ఆయన అందించిన సుదీర్ఘ, విశిష్ట సేవలను గుర్తిస్తూ డెహ్రాడూన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
తన కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో అంజనీ కుమార్ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనతోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్సమీర్ సిన్హా, కర్ణాటకకు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారిణి మీనాక్షి నేగిలకు కూడా ఈ పురస్కారాలు దక్కాయి. ఇలాంటి అధికారులు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని గవర్నర్కొనియాడారు.
