పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్మండలం శేరుపల్లిలోని సప్తగిరి రైస్ మిల్లులో హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు సోమవారం తనిఖీలు చేపట్టారు. 2022–-23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లు ఓనర్లకు జూన్ 3న నోటీసులు ఇవ్వగా ఎలాంటి స్పందన రాకపోవడంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ సీజన్‌కు సంబంధించి 5565.291 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టెండర్ ద్వారా దక్కించుకోగా.. అందులో నుంచి 217.476 టన్నులు మాత్రమే తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించారు.
ఇంకా 5347.815 టన్నుల ధాన్యం బకాయి ఉంది. వీటికి సంబంధించిన డబ్బును ఆఫీసర్లు లెక్క తేలుస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లై డీటీలు పరమేశ్, ప్రసాద్పాల్గొన్నారు.
