వచ్చే జూన్ నాటికి కర్వెనకు కృష్ణా జలాలు : దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

వచ్చే జూన్ నాటికి కర్వెనకు కృష్ణా జలాలు : దేవరకద్ర ఎమ్మెల్యే  జి.మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల/చిన్నచింతకుంట, వెలుగు: వచ్చే ఏడాది జూన్​ నాటికి కర్వెన రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కృష్ణా జలాలతో నింపుతామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్​జిల్లా అడ్డాకుల మండలం ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, కేఎల్​ఐ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పెండింగ్ పనులను ఆ శాఖ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. నిజలాపూర్, మహమ్మద్ ఉసేన్ పల్లి, పోల్కంపల్లి, రామన్నపల్లి గ్రామాల మధ్య అసంపూర్తిగా మిగిలిన కేఎల్ఐ డీ8, డీ 12  కెనాల్ పనులను పరిశీలించి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ కింద పెండింగ్ కాలువ పనులు పూర్తయితే దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అంతకుముందు చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. కౌకుంట్ల వద్ద తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే  వెల్లడించారు. అనంతరం దేవరకద్ర మండలం గురకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించారు.