మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీకి చెందిన టెన్త్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. మల్లికార్జున్(16) ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. గతంలో ఏడోతరగతి వరకు చదివి మధ్యలో మానేశాడు. వయసు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు మల్లికార్జున్‌ను ఈ ఏడాది పదో తరగతిలో జాయిన్ చేయించారు.
అయితే, మంచి మార్కులు రావడం లేదని కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. రాఖీ పండుగ సందర్భంగా మల్లికార్జున్ తల్లి స్వప్న నిజామాబాద్‌కు, బంధువుల వివాహానికి తండ్రి కొండయ్య వెళ్లారు. మల్లికార్జున్ తన తమ్ముడు, సోదరితో కలిసి ఇంట్లోనే ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం బెడ్ రూమ్ లోకి వెళ్లి మల్లికార్జున్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
