కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు భరోసా.. వట్టెం రిజర్వాయర్ నుంచి పూర్తైన తూము నిర్మాణం

కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు భరోసా.. వట్టెం రిజర్వాయర్ నుంచి పూర్తైన తూము నిర్మాణం
  • 3 కి.మీ లింక్​ కాలువ భూసేకరణకు సర్కార్​ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •  1.50లక్షల ఎకరాలకు పక్కగా అందనున్న సాగునీరు
  •  తీరనున్న టెయిల్​ఎండ్​ రైతుల కష్టాలు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, వెలుగు: కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందనున్నాయి. కల్వకుర్తి లిఫ్ట్​ఎత్తిపోతల పథకంలోని 29వ ప్యాకేజీ పరిధిలోకి వచ్చే 1.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవసరమైన లింక్​ కెనాల్​నిర్మాణానికి 23ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం రిజర్వాయర్​ వద్ద ఏర్పాటు చేసిన తూము నుంచి మూడు కి.మీల కాలువను నిర్మించి దాన్ని లింగసానిపల్లె దగ్గర కేఎల్ఐ మెయిన్​ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లింక్​చేయనున్నారు.

వట్టెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే 16.74 టీఎంసీల నీటి నుంచి లింక్​ కెనాల్​ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని 29వ ప్యాకేజీలోని కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెయిన్​ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వదిలిపెట్టనున్నారు. దీంతో నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, తాడూరు, మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి, వంగూరు మండలాల్లో 1.50 లక్ష ఎకరాలు,  డీ82 మెయిన్​ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని​50వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

భూసేకరణకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

వట్టెం కట్ట నుంచి 3 కి.మీ లింక్​ కెనాల్​ నిర్మించేందుకు అవసరమైన 23 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అధికారులు నోటిఫికేషన్​ జారీ చేశారు.  కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ లిఫ్ట్​ స్కీంలోని 29వ ప్యాకేజీ మెయిన్​కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం గుడిపల్లిగట్టు రిజర్వాయర్​నుంచి నీటిని వదులుతున్నారు. ఈ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో డీ5, డీ8, డీ10, డీ 26, డీ 28, డీ55, డీ64, డీ73, ​ డీ82 మెయిన్​ కెనాల్​ద్వారా సాగునీరు అందుతోంది.

ఇదే కెనాల్​నుంచి ఘనపూర్, బుద్దారం బ్రాంచ్​ కెనాల్స్​ద్వారా వనపర్తి నియోజకవర్గానికి నీరు ఇస్తున్నారు. ఇవే కాకుండా కర్నే తాండ లిఫ్ట్, మార్కండేయ లిఫ్టులను ఏర్పాటు చేశారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్​నుంచి మూడు పంపుల ద్వారా ఎత్తిపోసే 2,400 క్యూసెక్కుల నీరు సరిపోక వనపర్తి, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. 

వట్టెం లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తీరనున్న రైతుల కష్టాలు

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం రిజర్వాయర్​నుంచి తూము ఏర్పాటు చేసి కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ 29వ ప్యాకేజీ పరిధిలో 2.17లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ తూము నిర్మాణం పూర్తికావడంతో లింగసాని పల్లె వద్ద కేఎల్ఐ మెయిన్​ కెనాల్​వరకు లింక్​ కెనాల్​నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ప్రస్తుతం గుడిపల్లిగట్టు రిజర్వాయర్​ నుంచి అందుతున్న నీటితో  పాటు వట్టెం రిజర్వాయర్​ లింక్​ కెనాల్​నుంచి 29వ ప్యాకేజీలోని మెయిన్​ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లె నుంచి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల వరకు వెళ్లే డీ82 కెనాల్​పరిధిలో 1.51లక్షల ఎకరాలకు సాగు నీరందే అవకాశాలు మెరుగుకానున్నాయి.

గుడిపల్లిగట్టు నుంచి 182 కి.మీల దూరంలో ఉన్న డీ82 పరిధిలోకి వచ్చే నాగిళ్ల చివరి భూముల వరకు సాఫీగా నీరు పారనుంది. దీనిద్వారానేసీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సొంత మండలం వంగూరు, సొంతూరు కొండారెడ్డిపల్లి రైతాంగానికి సాగునీరు అందనుంది. భూసేకరణకు అవసరమైన నిధులతో పాటు 23కి.మీల కెనాల్​నిర్మాణానికి రూ.25కోట్లు, ఇతర నిర్మాణాల కోసం రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా. కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెయిన్​ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వట్టెం లింక్​ కెనాల్​కలిసే లింగసానిపల్లె వద్ద క్రాస్​ రెగ్యులేటర్​ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం...

వట్టెం రిజర్వాయర్​నుంచి కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెయిన్​కెనాల్​వరకు లింక్​ కెనాల్​నిర్మాణానికి 23 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్​విడుదలైంది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానే నాలుగు నెలల్లో లింక్​ కెనాల్​ పనులు పూర్తి చేస్తాం. 29వ ప్యాకేజీలోని మెయిన్​ కెనాల్​పరిధిలోని అన్ని ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు, కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు, డీ82 కెనాల్​ పరిధిలోని 50వేల ఎకరాలలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 
-పార్థసారథి, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ ఇరిగేషన్ ఎస్ఈ