పదేండ్ల రాక్షస పాలనకు చరమగీతం పలికి వెయ్యి రోజులైంది : విప్ వేముల వీరేశం 

పదేండ్ల రాక్షస పాలనకు చరమగీతం పలికి వెయ్యి రోజులైంది : విప్ వేముల వీరేశం 

హైదరాబాద్, వెలుగు:  పదేండ్ల రాక్షస పాలనకు తెలంగాణ జనం చరమగీతం పలికి వెయ్యి రోజులైందని విప్ వేముల వీరేశం అన్నారు. సోమవారం సీఎల్పీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అద్భుతమైన సంక్షేమ పాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలన విధ్వంసం వైపు సాగితే... రేవంత్ పాలన వికాసం వైపు సాగుతోందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు అవుతున్నా బీఆర్ఎస్ నేతలు ప్రజా తీర్పును గౌరవించడం లేదని విమర్శించారు.

ఆ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదని మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ...బీఆర్ఎస్ పరిస్థితి కృష్ణ శాస్త్రి బాధలా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ వెయ్యి రోజుల ప్రజా పాలనను తెలంగాణ జనానికి సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తే, కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష నేతగా వెయ్యి రోజులుగా ఫామ్ హౌస్‌‌కే పరిమితం అయ్యారని విమర్శించారు.