జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థుల ధర్నా

జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థుల ధర్నా

జమ్మికుంట, వెలుగు: పెండింగ్ స్కాలర్​షిప్ లను వెంటనే విడుదల చేయాలని  ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద స్టూడెంట్లు సోమవారం ఆందోళన చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే పెండింగ్​ స్కాలర్​షిప్​ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పిన రేవంత్​రెడ్డి దాదాపు మూడేండ్లు అవుతున్నా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. 

కనీసం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల స్కాలర్​షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ ​చేశారు.