కరీంనగర్ టౌన్: ‘కోట’ స్టూడెంట్కు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్

కరీంనగర్ టౌన్: ‘కోట’ స్టూడెంట్కు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్

కరీంనగర్ టౌన్, వెలుగు: కర్ణాటకలో ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించిన 7వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీల్లో కరీంనగర్​లోని కోట రెజోనెన్స్ జూనియర్ కాలేజీ స్టూడెంట్ యు.పవన్‌‌‌‌రాజ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని, ఇంటర్నేషనల్ ​ఛాంపియన్ షిప్ సాధించాడని కాలేజీ చైర్మన్ డాక్టర్ దబ్బెట అంజిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.  

కరాటే వంటి మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, లెక్చరర్లు, స్డూడెంట్లు పాల్గొన్నారు.