సిరిసిల్ల పట్టణాభివృద్ధికి రూ.1.50 కోట్లు

సిరిసిల్ల పట్టణాభివృద్ధికి రూ.1.50 కోట్లు
  •     అభివృద్ధి పనుల కోసం ఏకగ్రీవ తీర్మానం
  •     బల్దియా సమావేశంలో నిర్ణయం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల పట్టణాభివృద్ధి కోసం మున్సిపల్ జనరల్ బాడీ 25 అంశాలతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిం చింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జిందం కళ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో రూ.1.50 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ కోసం పట్టణంలోని బతుకమ్మ ఘాట్​తో పాటు ఏడు విలీన గ్రామాల్లో ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు రూ.29 లక్షలు కేటాయించింది. 

బతుకమ్మల నిమజ్జనం కోసం రూ.59 లక్షలతో కొలనులను ఏర్పాటు చేయనుంది. పలు వార్డుల్లో వీధి లైట్ల కోసం రూ.10 లక్షలు, సిరిసిల్ల పురపాలక సంఘం కార్యాలయ భవనం రెనోవేషన్​కు రూ.42 లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విద్యానగర్, నెహ్రూనగర్ శ్మశానవాటికల్లో బర్నింగ్ ప్లాట్ ఫామ్స్ రిపేర్ల కోసం మరో రూ.10 లక్షలు కేటాయించింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైస్ -చైర్మన్ దార్ల సందీప్, వార్డు సభ్యులు, కో-ఆప్హన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.