ఖమ్మం పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 15 మంది పోలీస్‌‌‌‌ సిబ్బందికి సేవా పతకాలు

ఖమ్మం పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 15 మంది పోలీస్‌‌‌‌ సిబ్బందికి సేవా పతకాలు

ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాల్లో ఖమ్మం పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 15 మంది సిబ్బందికి పతకాలు లభించాయి. ఉత్తమ సేవ పతకాలకు అడిషనల్‌‌‌‌ డీసీపీ బి.రామానుజం, హెడ్‌‌‌‌ కానిస్టేబుళ్లు వి.బిక్షపతి, కె.సూర్యప్రకాశ్​రెడ్డి ఎంపికయ్యారు. సేవా పతకాలు పొందిన మరో 12 మంది సిబ్బందికి సోమవారం పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌‌‌‌ సునీల్‌‌‌‌ దత్‌‌‌‌ పతకాలు అందజేసి అభినందించారు. 

ఇదే స్ఫూర్తితో విధుల్లో మరింత ఉత్తమంగా సేవలందించాలని ఆకాంక్షించారు. సేవా పతకాలు పొందిన వారిలో ఎస్సై కె.నాగేంద్రరావు, ఏఎస్సైలు ఎన్‌‌‌‌.రామిరెడ్డి, బి.సుందర్‌‌‌‌రావు, ఏఆర్‌‌‌‌ ఎస్సైలు ఎండి.హలీమ్‌‌‌‌, జి.భాస్కర్‌‌‌‌రావు, హెడ్‌‌‌‌ కానిస్టేబుళ్లు ఎం.వెంకటేశ్వర్లు, టి.హరిచరణ్‌‌‌‌సింగ్‌‌‌‌, షేక్‌‌‌‌ మదార్‌‌‌‌ సాహెబ్‌‌‌‌, ఐ.ప్రభాకరరావు, సీహెచ్‌‌‌‌. రామారావు, కానిస్టేబుళ్లు జె.కృష్ణ, డి.సుశీల్‌‌‌‌కుమార్‌‌‌‌ ఉన్నారు.