జగిత్యాల జిల్లాలో గణేశ్ నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 14ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మెట్ పల్లిలో గత రాత్రి జరిగింది. స్థానిక గణేష్ నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు
గురై తేజ (14) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మెట్ పల్లి సీనియర్ బీజేపీ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి కుమారుడు. వేడుకల్లో భాగంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన బాలున్ని స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి చిన్ననాటి నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని బంధువులు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు విశేష సేవలందుకొని నిమజ్జానికి బయలుదేరుతున్న వినాయకునికి భక్తులు అట్టహాసంగా వీడ్కోలు చెప్తున్నారు. ఆట, పాటలతో గణేశ్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు.
